తెలంగాణ

telangana

ETV Bharat / state

బీసీల పట్ల కేసీఆర్​​ తీవ్ర వివక్ష చూపుతున్నారు: ఎల్​. రమణ - జాతీయ బీసీ సంఘం

బీసీల పట్ల సీఎం కేసీఆర్​ తీవ్ర వివక్ష చూపుతున్నారని రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు ఎల్​. రమణ ఆరోపించారు. బీసీ విద్యార్థులకు బోధనా రుసుములు చెల్లించకపోతే గ్రేటర్​ ఎన్నికల్లో తెరాసని ఓడించాలని సూచించారు. హైదరాబాద్​ బషీర్​బాగ్​లోని​ ప్రెస్​క్లబ్​లో జాతీయ బీసీ సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

bc welfare association meeting in basheerbagh
బీసీల పట్ల కేసీఆర్​​ తీవ్ర వివక్ష చూపుతున్నారు: ఎల్​. రమణ

By

Published : Nov 24, 2020, 2:22 PM IST

బీసీల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర వివక్ష చూపుతున్నారని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. హైదరాబాద్‌ బషీర్‌బాగ్​లోని ప్రెస్‌క్లబ్‌లో జాతీయ బీసీ సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో రమణతో పాటు ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాలచందర్‌కు అభినందన సభ నిర్వహించారు.

ఎన్నికలకు ముందు కేజీ టు పీజీ అమలు చేస్తామని చెప్పి, బడుగు బలహీన వర్గాలను ప్రభుత్వం మోసం చేసిందని రమణ మండిపడ్డారు. బీసీ విద్యార్థులకు బోధనా రుసుములు చెల్లించకపోతే ఈ గ్రేటర్ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను ఓడించాలని సూచించారు. బీసీలకు చట్ట సభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని.. కాలేజీ కోర్సుల్లో చదివే విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:ఒక్క అవకాశం ఇస్తే మల్లేపల్లి డివిజన్​ని అభివృద్ధి చేస్తా: మెట్టు వాణి

ABOUT THE AUTHOR

...view details