చట్టసభలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. బీసీలకు ప్రజాస్వామ్యయుతంగా రావాల్సిన వాటా రావటంలేదని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
'చట్ట సభల్లో 50 శాతం బీసీలుండాలి' - RESERVATION
స్వతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా బీసీలకు సముచిత స్థానం దక్కటం లేదని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో బీసీలు వివక్షకు గురవుతున్నారని పేర్కొన్నారు.
బీసీలు వివక్షకు గురవుతున్నారు