పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల నమోదు ప్రక్రియలో అనుసరిస్తున్న విధానంపై రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం మండిపడింది. హైదరాబాద్ దోమలగూడలోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ కమిషన్ తీరును ఖండించారు.
2014 ఓటర్ల జాబితాను పరిగణలోకి తీసుకోవాలి : బీసీ సంఘం - జాజుల శ్రీనివాస్
త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ 2014 పట్టభద్రుల ఓటర్ల జాబితాను కూడా పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఓటర్ల నమోదు ప్రక్రియలో కమిషన్ అనుసరిస్తున్న తీరుపై బీసీ సంఘం మండిపడింది. అందరూ మళ్లీ కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలనడం పట్ల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
![2014 ఓటర్ల జాబితాను పరిగణలోకి తీసుకోవాలి : బీసీ సంఘం BC sangham Leader Jajula Srinivas Comments On Election commission](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9106839-1104-9106839-1602216055661.jpg)
2014 ఓటర్ల జాబితాను పరిగణలోకి తీసుకోవాలి : బీసీ సంఘం
గతంలో విద్యావంతులు, మేధావులు, పట్టభద్రులు నమోదు చేసుకున్న ఓటర్ల జాబితా రద్దు చేసి కొత్తగా పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని అని చెప్పడాన్ని ఆయన వ్యతిరేకించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో గత పట్టభద్రుల అందరూ తిరిగి తమ పేరు నమోదు చేసుకోమని ప్రకటించడం భవ్యం కాదన్నారు. పట్టభద్రులందరూ తమ ఓటుహక్కును ప్రజాస్వామ్యబద్ధంగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
ఇదీ చూడండి:నవంబర్, డిసెంబర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు: పార్థసారథి