తెలంగాణ

telangana

ETV Bharat / state

'బీసీల హక్కుల సాధన కోసం ఒక వేదిక అవసరం' - hyderabad district news

సమాజంలో వెనుకబడిన వర్గాల హక్కుల సాధన కోసం పోరాటం చేయడానికి ఒక వేదిక అవసరమని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ‘బీసీలకు క్రీమీలేయర్‌ రద్దు- ప్రమోషన్లలో రిజర్వేషన్లు’ అనే అంశంపై నిర్వహించిన రాష్ట్ర సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

BC Job Association organized a conference on reservations in BCs crimi layer cancellation promotions
బీసీల హక్కుల సాధన కోసం ఒక వేదిక అవసరం

By

Published : Jan 11, 2021, 1:04 PM IST

సమాజంలో వెనుకబడిన వర్గాల హక్కుల సాధన కోసం పోరాటం చేయడానికి ఒక వేదిక అవసరమని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ‘బీసీలకు క్రీమీలేయర్‌ రద్దు- ప్రమోషన్లలో రిజర్వేషన్లు’ అనే అంశంపై హైదరాబాద్​లో నిర్వహించిన రాష్ట్ర సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొ న్నారు.

బీసీల్లో క్రిమిలేయర్‌ను రద్దు చేయాలని బీసీ సంక్షేమ శాఖ జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. సమాజంలో బీసీల పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి వీడే వరకు ఉద్యోగులు, మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు సంఘటితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. బీసీ సంక్షేమ శాఖ తరపున నూతన క్యాలెండర్​ను గంగుల కమలాకర్​తో కలిసి ఆర్.కృష్ణయ్య ఆవిష్కరించారు.

ఇదీ చదవండి:నదిలో బంగారు నాణేలు- తండోపతండాలుగా జనాలు

ABOUT THE AUTHOR

...view details