రాజ్యాంగ స్ఫూర్తి... రాసుకున్న రాతలు అమలై ఉంటే క్రిమిలేయర్ సమస్య వచ్చేది కాదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పాలించే నాయకులకు రాజ్యాంగాన్ని అర్థం చేసుకునే మెరిట్ ఉండాలని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలే కేంద్ర బిందువుగా పనిచేయాలి తప్పితే.. అందుకు భిన్నంగా వ్యవహారించకూడదన్నారు.
హైదరాబాద్ రవీంద్రభారతి సమావేశ మందిరంలో బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం దైనందిని, కాలమానిని ఆవిష్కరించారు.