వైన్స్షాపు ఓనర్లు అమ్మకాలపైనే దృష్టి పెడుతున్నారు తప్ప ప్రజల ఆరోగ్యం గురించి ఏ మాత్రం పట్టించుకోవడంలేదని బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉపేంద్రమ్మ యాదవ్ ఆరోపించారు. హైదరాబాద్ కొత్తపేటలోని ఓ మద్యం దుకాణంలో కాలపరిమితి దాటిన రెండు కాటన్ల బీర్లను విక్రయించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
మద్యం దుకాణాల నిర్వాహకుల నిర్లక్ష్యం - కాలం చెల్లినబీర్లు అమ్మకం జరుపుతున్న దుకాణాలపై ఉపేంద్రమ్మ యాదవ్ మండిపడ్డారు
లాక్‌డౌన్ నేపథ్యంలో సుమారు 45 రోజుల తర్వాత మద్యం దుకాణాలను తెరిచిన యజమానులు కాలం చెల్లిన బీర్లను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇదేంటని నిలదీసిన కొనుగోలుదారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉపేంద్రమ్మ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాలం చెల్లిన బీర్లు... నిర్లక్ష్యంగా వహరిస్తున్న దుకాణదారులు
వాటిని కొనుగోలు చేసిన ఓ వ్యక్తి కాల పరిమితి దాటిపోయిందని బీర్లను తిరిగి దుకాణదారునికి చూపించి ఇదేంటని ప్రశ్నిస్తే.. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడని ఆమె పేర్కొన్నారు. దుకాణం యజమానిపై ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నామని.. వెంటనే ఆ దుకాణం లైసెన్స్ రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
కాలం చెల్లిన బీర్లు... నిర్లక్ష్యంగా వహరిస్తున్న దుకాణదారులు