తెలంగాణ

telangana

ETV Bharat / state

బీసీ వ్యతిరేక ప్రభుత్వానికి గుణపాఠం చెబుదాం: కృష్ణయ్య - R krishnaiah comments on cm kcr

హైదరాబాద్ లింగంపల్లి సుందరయ్య కళానిలయంలో 26 కులాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బీసీ ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

'బీసీ వ్యతిరేక ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడిద్దాం'
'బీసీ వ్యతిరేక ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడిద్దాం'

By

Published : Nov 19, 2020, 4:36 PM IST

బీసీ వ్యతిరేక ప్రభుత్వాన్ని గ్రేటర్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య సూచించారు. రాష్ట్రంలో బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను వెంటనే కలపాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లింగంపల్లి సుందరయ్య కళానిలయంలో 26 బీసీ కులాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బీసీ ఆత్మగౌరవ సభ నిర్వహించారు.

బీసీ కులాలను తొలగించే, కలిపే హక్కు ముఖ్యమంత్రికి లేదని మండిపడ్డారు. కులాలను తొలగించే, కలిపి శాస్త్రీయత కేవలం బీసీ కమిషన్​కు మాత్రమే ఉందని తెలిపారు. ఎన్నికల ముందు ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి సీఎం కేసీఆర్... చేస్తున్న ప్రయత్నాలను గ్రేటర్ ప్రజలు తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. బీసీ వ్యతిరేక విధానాలను అవలంభించే తెరాసకు ఓటర్లు తగిన గుణపాఠం చెబుతారని జోస్యం చెప్పారు.

ఇదీ చదవండి:దేశంలోనే సేఫెస్ట్ సిటీగా హైదరాబాద్​ను తీర్చిదిద్దాం: కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details