BC 1 Lakh Scheme in Telangana :తెలంగాణలో ఈ ఏడాది చివరన ఎన్నికలు జరగనుండడంతో అన్ని వర్గాల ప్రజల ఓట్లను ఆకర్షించడమే వ్యూహంగా అధికార పార్టీ నయా పథకాలకు శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలో జూన్లో నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 'బీసీ చేతి, కుల వృత్తుల వారికి రూ.లక్ష ఆర్థిక సాయం'(Telangana BC 1 Lakh Scheme)అనే మరో కొత్త సంక్షేమ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.
Telangana BC Bandhu Second Phase :విశ్వబ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, రజక, శాలివాహన కుమ్మరి, మేదరి తదితర కులవృత్తుల వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. దీంతో పథకానికి జూన్ 6 నుంచి 20 వరకు ఆయా వృత్తుల వారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సంక్షేమ దినోత్సవం రోజు(జూన్ 9)న మంచిర్యాలలో తొలి లబ్దిదారుడికి సీఎం కేసీఆర్ లక్ష ఆర్థికసాయం(CM KCR Mancherial Tour) చెక్కును అందించి ఈ పథకాన్ని ప్రారంభించారు.
Rs. 1 Lakh for BCs in Telangana : మొత్తం 5.28 లక్షల దరఖాస్తులు రాగా వాటిలో 4.21 లక్షల మందిని అర్హులుగా తేల్చారు. తదుపరి మొదటి విడతగా ప్రతి నెల 15నుంచి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో 300-400 మందికి పంపిణీ చేయాలని నిర్ణయించారు. కానీ కొన్ని కారణాల వల్ల ప్రక్రియ సజావుగా సాగలేదు. దాంతో ఆగస్టు 15 నుంచి రెండో విడత బీసీలకు లక్ష ఆర్థిక సాయం(Telangana BC 1 Lakh Scheme Second Phase) లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ షురూ అయింది. అయితే అందులో మీరు ఉన్నారో లేదో కింద పేర్కొన్న అర్హతలు, సమర్పించిన పత్రాలు, ఎంపిక ప్రక్రియ విధివిధానాల ద్వారా తెలుసుకోండిలా...
ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలిలా :
1. బీసీ కులవృత్తిదారులు, చేతివృత్తిదారులు 'లక్ష రూపాయల ఆర్థిక సాయం' పథకానికి అర్హులు
2. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుతుంది.
3. జూన్ 2 నాటికి 18నుంచి 55 సంవత్సరాలు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు.
4. దరఖాస్తుదారుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 1.50 లక్షలకు మించరాదు.
5. ఆయా కులాల పనిముట్లు, ముడిసరుకు కొనుగోలుకు మాత్రమే ఈ ఆర్థికసాయం అందిస్తారు.
6. గత 5 సంవత్సరాలలో దరఖాస్తుదారుడు ఏ ప్రభుత్వ శాఖ ద్వారా ఆర్థికసాయం పొంది ఉండకూడదు.
7. అదేవిధంగా 2017-18లో రూ.50వేల ఆర్థికసాయం పొందినవారు కూడా ఈ పథకానికి అనర్హులు.
దరఖాస్తు సమయంలో సమర్పించాల్సిన పత్రాలు :