హైదరాబాద్ కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలాజీనగర్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ మహిళలకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చీరలను అందజేశారు.
కూకట్పల్లిలో బతుకమ్మ చీరల పంపిణీ.. పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణారావు - బతుకమ్మ చీరల పంపిణీ
కులమతాలకతీతంగా అన్ని పండుగలు, సంప్రదాయాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ విలువిస్తారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. తెలంగాణ ఆడపడుచులకు దసరా కానుకగా కేసీఆర్ అందించే బతుకమ్మ చీరలను కూకట్పల్లి నియోజకవర్గంలో పంపిణీ చేసినట్లు తెలిపారు.
కూకట్పల్లిలో బతుకమ్మ చీరల పంపిణీ..
తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు, వారి పండుగలు, సంప్రదాయాలకనుగుణంగా.. సీఎం కేసీఆర్ కానుకలు అందజేస్తున్నారని ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. ఈ నేపథ్యంలోనే బతుకమ్మ పండుగకు ఏటా తెలంగాణ ఆడపడుచులందరికి చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలతో దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఆదర్శంగా నిలుస్తోందన్నారు.