భాజపా మహిళా మోర్చ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 9 ఉమ్మడి జిల్లాల్లో 9 రోజుల బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు భాజపారాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. హైదరాబాద్ భాజపా ప్రధాన కార్యాలయంలో బతుకమ్మ సంబురాల పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. ఈనెల 28న గోల్కొండలో ప్రారంభించనున్న సంబురాలు.... అక్టోబర్ 8న ముషిరాబాద్‌లో ముగియనున్నట్లు తెలిపారు. అనంతరం మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఎంపీటీసీ నర్సింహారావు, వనపర్తి నుంచి స్వతంత్ర అభ్యర్థి వెంకటేశ్వర్, ఏబీనగర్ నుంచి పల్లకాడి రాజుగౌడ్‌తోపాటు పలువురు కార్యకర్తలు భాజపాలో చేరారు. వారిని లక్ష్మణ్ సాదరంగా భాజపాలోకి ఆహ్వానించారు.
తొమ్మిది జిల్లాల్లో భాజపా బతుకమ్మ సంబరాలు: లక్ష్మణ్ - భాజపా మహిళ మోర్చ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు
తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో తొమ్మిది రోజులపాటు భాజపా మహిళా మోర్చ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ తెలిపారు.
BATUKAMMA CELEBRATIONS UNDER BJP WOMEN WING IN ALL DISTRICTS