తెలంగాణ

telangana

ETV Bharat / state

భోలక్​పూర్ మహిళా మత్స్య సొసైటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు

హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని భోలక్​పూర్ మహిళా మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. నగరంలో కరోనా వ్యాప్తిని నిర్మూలించాలని.. వరదలు రాకుండా చల్లగా కాపాడాలని అమ్మవారిని ప్రార్థించారు.

భోలక్​పూర్ మహిళా మత్స్య సొసైటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు
భోలక్​పూర్ మహిళా మత్స్య సొసైటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు

By

Published : Oct 23, 2020, 5:38 AM IST

హైదరాబాద్ ముషీరాబాద్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో భోలక్​పూర్ మహిళా మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో గంగపుత్ర మహిళలు బతుకమ్మ ఆడి పాడారు. నగరంలో కరోనా వ్యాప్తి తగ్గి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని బతుకమ్మను కోరుకున్నట్లు హైదరాబాద్ జిల్లా మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షురాలు పద్మ బెస్త తెలిపారు.

త్వరగా కోలుకోవాలి..

భారీ వర్షాలకు అతలాకుతలమైన హైదరాబాద్ నగర వాసులు విపత్తుల నుంచి త్వరగా కోలుకోవాలని పద్మ ఆకాంక్షించారు. ఎలాంటి ఆపద బారిన పడకుండా సురక్షితంగా బయటపడాలని తమ కుల దైవం గంగాదేవిని ప్రార్థించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మహిళా మత్స్య సహకార సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

భోలక్​పూర్ మహిళా మత్స్య సొసైటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు

ఇవీ చూడండి : నాగరాజు బినామీ లాకర్లలో 1,250 గ్రాముల బంగారం, 7.2 కిలోల వెండి

ABOUT THE AUTHOR

...view details