తెలంగాణ

telangana

ETV Bharat / state

కాదేదీ కవిత అవినీతికి అనర్హమన్న భట్టి విక్రమార్క - Batti vikramarka latest news

Batti vikramarka fires on kavitha కాదేదీ కవిత అవినీతికి అనర్హం అన్న చందనా దోపిడీ జరుగుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కేసీఆర్‌ కుమార్తె వసూళ్లకు పాల్పడుతున్నారని వెల్లడించారు.

Batti vikramarka fires on kavitha
కాదేదీ కవిత అవినీతికి అనర్హమన్న భట్టీ విక్రమార్క

By

Published : Aug 23, 2022, 7:16 PM IST

Batti vikramarka fires on kavitha దిల్లీ మద్యం పాలసీలో కుంభకోణం జరిగితే.. అచ్చం అలాంటి విధానమే ఉన్న తెలంగాణలో ఇంకెంత అవినీతి జరిగిందో తేల్చాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. తెరాస ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందని అంటున్న భాజపా.. ఎందుకు ఆధారాలను సీబీఐకి ఇ్వవడం లేదని ప్రశ్నించింది. కాదేదీ కవిత అవినీతికి అనర్హం అన్నట్లుగా కేసీఆర్‌ కుమార్తె వసూళ్లకు పాల్పడుతున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. ఫీనిక్స్‌ కూడా కేసీఆర్‌ కుటుంబానికి చెందిన బినామీ సంస్థే అని విమర్శించారు. ఈడీ, సీబీఐలను దేశ సంపద లూటీ చేసేవారిపై ప్రయోగించాలని హితవు పలికారు.

దిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పాత్రపై ఆధారాలు బయటపెట్టాలి. దిల్లీ తరహా మద్యం పాలసీ ఉన్న రాష్ట్రంలోనూ భారీ అవీనితి జరిగింది. కాదేదీ కవిత అవినీతికి అనర్హం అన్నట్లుగా దోపిడీ జరుగుతోంది. ఫీనిక్స్‌ కూడా కేసీఆర్‌ కుటుంబానికి బినామీ సంస్థే. ఈడీ, సీబీఐలను దేశ సంపద లూటీ చేసేవారిపై ప్రయోగించాలి. మద్యం అవినీతిపై ఆర్ధికశాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించాలి. -భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

కాదేదీ కవిత అవినీతికి అనర్హమన్న భట్టీ విక్రమార్క

ఇవీ చదవండి:Rajasingh arrest నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత, ఇరువర్గాలపై లాఠీఛార్జ్‌

ABOUT THE AUTHOR

...view details