కొవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కొవిడ్ బారిన పడిన గ్రామీణ ప్రజలు సరైన చికిత్స అందక ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో సీనియర్ అధికారులతో మానిటరింగ్ కమిటీ వేసి... కొవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ, చికిత్స, మందుల లభ్యత తదితర అంశాలను పరిశీలించాలని సూచించారు. దిల్లీ మాదిరిగా యాప్‌ను అభివృద్ధి చేసి ఆస్పత్రుల వారీగా పడకల లభ్యత, ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్లు తదితర వివరాలు పొందుపరచాలని పేర్కొన్నారు.
కొవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: భట్టి - కొవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని భట్టి డిమాండ2
రాష్ట్రంలో మారుమూల పల్లెలకు కొవిడ్ వ్యాపించిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. గ్రామీణ ప్రజలు కొవిడ్‌కు మెరుగైన వైద్యం చేయించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు.
![కొవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: భట్టి batti vikramarka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11719739-277-11719739-1620729431394.jpg)
batti vikramarka
జిల్లా స్థాయిలో కూడా మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కమిటీ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో పనిచేసేట్లు చూడాలన్నారు. అవసరమైతే అన్ని పనులు పక్కన పెట్టి కొవిడ్ కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి నియోజక వర్గం కేంద్రంలో... క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, మండల స్థాయిలో ఆక్సిజన్‌తో కూడిన 30 బెడ్లు ఉన్న కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.