కాలుష్య నివారణ నగరంగా తీర్చిదిద్దడమే ముఖ్య ఉద్దేశంగా... హైదరాబాద్ నగర శివారు చేర్యాలలోని గీతాంజలి కళాశాల ఇంజినీరింగ్ విద్యార్థులు కాలుష్య రహిత ద్విచక్రవాహనాన్ని తయారు చేశారు. కళాశాల ఛైర్మన్, అధ్యాపకుల ప్రోత్సాహంతో కాలుష్య రహిత బ్యాటరీ వాహనాన్ని యువ ఇంజనీర్లు తయారు చేశారు.
గంట ఛార్జింగ్ పెడితే...
కేవలం గంటసేపు ఛార్జింగ్ పెడితే 70 నుంచి 80 కిలోమీటర్ల వరకు ఎలాంటి కాలుష్యాన్ని వెదజల్లకుండా ప్రయాణం చేసేలా దీనిని రూపొందించారు. ఈ వాహనాన్ని దొంగలించినా జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా సులభంగా కనిపెట్టవచ్చు.
ఏదైనా జరిగితే...
ఈ బైకుకు మరో ప్రత్యేకత ఉంది. మద్యం సేవించి వాహనం నడిపినా, హెల్మెట్ ధరించకపోయినా ముందుకు కదలదు. మార్గమధ్యంలో ఆగిపోయినా, ఏదైనా ప్రమాదం జరిగిన పోలీసులకు, కుటుంబసభ్యులకు, అంబులెన్స్‌కు సమాచారాన్ని చేరవేస్తుందని విద్యార్థులు పేర్కొన్నారు.
ప్రోత్సాహిస్తే మరెన్నో...
రెండు బైక్‌ల తయారీకి లక్ష ఆరు వేలు ఖర్చు అయినట్లు వెల్లడించారు. ఈ మొత్తాన్ని కళాశాల యాజమాన్యమే భరించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రోత్సాహిస్తే మరిన్ని కాలుష్యరహిత వాహనాలను అతి తక్కువ ఖర్చుతో తయారు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
మద్యం సేవించినా... హెల్మెట్ ధరించకున్నా ఈ బైక్ నడవదు - invented by engineering students
పెరుగుతున్న కాలుష్యానికి అడ్డుకట్ట వేసేలా... పెట్రోలు ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో కాస్తా ఊరటనిచ్చేలా గీతాంజలి కళాశాల ఇంజినీరింగ్ విద్యార్థులు వినూత్న కాలుష్య రహిత ద్విచక్రవాహనాన్ని కనుగొన్నారు. అంతే కాదండోయ్ అత్యవసర పరిస్థితుల్లో దీనితో ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు. సరికొత్త ఫీచర్లు తనలో దాచుకున్న ఈ బైక్‌ని మీరు ఓ లుక్కేయండి.
మద్యం సేవించినా... హెల్మెట్ ధరించకున్నా ఈ బైక్ నడవదు