తెలంగాణ

telangana

ETV Bharat / state

భాగ్యనగరంలో వైభవంగా బతుకమ్మ సంబురాలు - bathukamma sambaralu in hyderabad

తెలంగాణ పూలపండుగ బతుకమ్మ సంబురాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొంటున్నారు. హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో ఎవరు ఎలా జరుపుకున్నారంటే...

భాగ్యనగరంలో వైభవంగా బతుకమ్మ సంబురాలు

By

Published : Oct 6, 2019, 3:20 PM IST

భాగ్యనగరంలో వైభవంగా బతుకమ్మ సంబురాలు

అంబర్​పేట

అంబర్​పేట మున్సిపల్​ గ్రౌండ్​లో అట్టహాసంగా కిషన్​రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు జరిగాయి. పూలపండుగలో మహిళలు, చిన్నారులు ఆటపాటలతో ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో కిషన్​రెడ్డితో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​, బ్యాడ్మింటన్​ ప్లేయర్​ పీవీ సింధు, మాజీఎంపీ వివేక్​ తదితరులు పాల్గొన్నారు.

చెర్లపల్లి

హైదరాబాద్​ చెర్లపల్లి చెరువు వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మల సంబురాల్లో నగర మేయర్​ సతీమణి బొంతు శ్రీదేవి పాల్గొన్నారు. మహిళలు చిన్నారులతో కలిసి పూల పండుగలో పాల్గొన్నారు.

గచ్చిబౌలి

గచ్చిబౌలిలోని గ్లోబల్​ పీస్​ ఆడిటోరియంలో తెలంగాణ మహిళా ఎంటర్​ప్రెన్యూర్స్​, బ్రహ్మకుమారీస్​ సంయుక్త ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కార్పొరేటర్​ విజయలక్ష్మి పాల్గొన్నారు.

జూబ్లీహిల్స్​

జూబ్లీహిల్స్​ పరిధిలోని షేక్​పేట్​లో సుమారు 1000 మంది మహిళలతో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్​ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్​ పాల్గొన్నారు.

కూకట్​పల్లి

కూకట్​పల్లి ఎల్లమ్మబండలో పూల పండుగ సంబురాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కూకట్​పల్లి జోనల్​ కమిషనర్​ మమత పాల్గొన్నారు. మహిళలతో కలిసి కోలాటం ఆడారు.

వీబీఐటీ

అభివృద్ధికి నోచుకోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో వీబీఐటీ సంస్థ విద్యార్థులు ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా హైదరాబాద్​లోని కళాశాల ప్రాంగణంలో దాండియా వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీనటులు శ్యామల, అమిత్​ తివారి హాజరై సందడి చేశారు.

సికింద్రాబాద్​

సికింద్రాబాద్​ బోయిన్​పల్లిలో దేవి నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించగా... పెద్ద ఎత్తున మహిళలు వచ్చారు.

ఇవీ చూడండి.. పాక్ టీనేజర్ హస్నేన్ ప్రపంచ రికార్డు

ABOUT THE AUTHOR

...view details