తెలంగాణలో పుట్టినందుకు అదృష్టంగా భావిస్తున్నానని... రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో(Bathukamma Festivities) ఆమె పాల్గొన్నారు. ఇంటర్ విద్యా ఐకాస ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఉత్సవాల్లో దేవసేనతో పాటు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
Bathukamma Celebrations: ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు - bathukamma celebrations in nampally
రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు(Bathukamma Celebrations) వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో మహిళలు, యువతులు పాల్గొని సందడి చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో బతుకమ్మ వేడుకలకు ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన పాల్గొన్నారు. ఇంటర్ విద్యా ఐకాస ఆధ్వర్యంలో దేవసేనకు ముక్కుపుడక, సారె పెట్టి ఘనంగా సన్మానించారు.
ఇంటర్ విద్యా శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు
బతుకమ్మ పండుగ(Bathukamma Festivities) తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతుందని దేవసేన అన్నారు. ఈ సందర్భంగా మహిళా అధికారులతో కలిసి దేవసేన, ఒమర్ జలీల్ బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. మహిళలతో కలిసి బతుకమ్మ పాట పాడుతూ, కోలాటం ఆడుతూ దేవసేన(Bathukamma Festivities) ఆకట్టుకున్నారు. విద్యా ఐకాస ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి సమక్షంలో మహిళా ఉద్యోగులు... దేవసేనకు ముక్కుపుడక, సారె పెట్టి ఘనంగా సన్మానించారు.
ఇదీ చదవండి:etela rajender: 'దేశ చరిత్రలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఒక చీకటి అధ్యాయం'
Last Updated : Oct 8, 2021, 7:51 PM IST