ఆస్ట్రేలియాలో ప్రవాసీయులు బతుకమ్మ వేడుకను ఘనంగా నిర్వహించారు. సిడ్నీ బతుకమ్మ, దసరా ఫెస్టివల్ ఇన్‌కార్పొరేటెడ్ అసోసియేషన్, ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు జరిపారు.
సిడ్నీలో కన్నుల పండువగా బతుకమ్మ, దసరా వేడుకలు - బతుకమ్మ సంబురాలు
సిడ్నీలో బతుకమ్మ, దసరా వేడుకలను... దసరా ఫెస్టివల్ ఇన్‌కార్పొరేటెడ్ అసోసియేషన్, ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కరోనా నుంచి కాపాడాలని గౌరమ్మను ప్రవాసీ మహిళలు ప్రార్థించారు.
సిడ్నీలో కన్నుల పండువగా బతుకమ్మ, దసరా వేడుకలు
కరోనా ప్రభావం వల్ల వర్చువల్ విధానంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించామని అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆస్ట్రేలియా ప్రతినిధులతో పాటు న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, మలేషియా, దుబాయ్ తదితర దేశాల్లోని తెలంగాణ వాసులు దృశ్యమాధ్యమం ద్వారా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కరోనా నుంచి కాపాడమని ప్రవాసీ మహిళలు గౌరమ్మను ప్రార్థించారు.