Bathukamma celebrations in Ireland : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ సంబురాలు ఎల్లలు దాటాయి. వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగు ఎన్నారైలు బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఐర్లాండ్‌లోని తెలంగాణ ఎన్నారైలు(Telanganites Of Ireland) బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు. డబ్లిన్ నగరంలో ముప్పై మంది వాలంటీర్స్ కలిసి ఈ బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు.
Bathukamma Celebrations At Telangana Secretariat : నూతన సచివాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
గత 11 సంవత్సరాలుగా ఈ బతుకమ్మ వేడుకలనువాలంటీర్లు, దాతల సాయంతో ఉచితంగా నిర్వహిస్తున్నారు. సుమారు ముప్పై మంది వాలంటీర్లు, నలభై మంది దాతలు ముందుకొచ్చి బంగారు బతుకమ్మ వేడుకలు ప్రతి సంవత్సరం జరపడానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఐర్లాండ్‌లో బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ప్రస్తుత అధ్యక్షుడు దయాకర్ రెడ్డి కొమురెల్లి, కమలాకర్ రెడ్డి కొలను, ఆర్గనైజేషన్ సభ్యులు కలిసి ఐర్లాండ్ తెలంగాణ ఎన్నారై ఫోరమ్ వ్యవస్థాపకుడు ప్రభోద్ రెడ్డి మేకల, ఉప వ్యవస్థాపక సభ్యడు సిద్ధం సాగర్లను ఘనంగా సత్కరించారు .