తెలంగాణ కళా సంస్కృతిని భావి తరాలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెరాస నేత వేణుగోపాల చారి అన్నారు. సహాయ ఫౌండేషన్, అభియ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్లో వారం రోజుల పాటు బతుకమ్మ వేడుకలని నిర్వహిస్తున్నారు. మహిళలు, పిల్లలు ప్రత్యేక ఫ్యాషన్ షోలు, నృత్యాలతో పాటు బతుకమ్మ ఆటలు ఆడారు.
తెలంగాణ కళా సంస్కృతిని భావి తరాలకు అందించేలా.. - బేగంపేట టూరిజం ప్లాజా హోటల్లో బతుకమ్మ సంబురాలు
బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్లో సహాయ ఫౌండేషన్, అభియ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. చిన్నలు, పెద్దల నృత్యాలు, మహిళల ఫ్యాషన్ షో లాంటివి నిర్వహిస్తూ ఉత్సాహంగా వేడుకలు జరుపుకుంటున్నారు. వారం రోజుల పాటు వేడుకలను నిర్వహిస్తున్నట్లుగా తెరాస నేత వేణుగోపాల చారి తెలిపారు.

తెలంగాణ కళా సంస్కృతిని భావి తరాలకు అందించేలా..
బతుకమ్మ వేడుకలు కేవలం రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారని తెరాస నేత తెలిపారు.
ఇదీ చదవండి:కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్‌కు లైన్ క్లియర్