తెలంగాణ

telangana

ETV Bharat / state

Bathukamma celebrations: గాంధీభవన్​లో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న రేవంత్​ - bathukamma celebrations in gandhi bhavan

రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆడపడుచులంతా కలిసి ఒక్క చోట చేరి బతుకమ్మ ఆడుతూ సందడి చేస్తున్నారు. రాజకీయ పార్టీల కార్యాలయాల్లోనూ మహిళా కార్యకర్తలు వైభవంగా వేడుకలు చేసుకుంటున్నారు. గాంధీ భవన్​లో బతుకమ్మ సంబురాలతో సందడి వాతావరణం ఏర్పడింది.

bathukamma celebrations in gandhi bhavan
గాంధీభవన్​లో బతుకమ్మ వేడుకలు

By

Published : Oct 9, 2021, 7:18 PM IST

గాంధీభవన్‌లో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావు, మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, జగ్గారెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. బతుకమ్మలను ఎత్తుకున్న మహిళలతో కలిసి రేవంత్​ రెడ్డి ఫొటోలు దిగారు.

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి

మహిళా కాంగ్రెస్‌ నేతల ఆటపాటలతో గాంధీభవన్​లో సందడి నెలకొంది. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మను అలంకరించి హారతి అందించారు. కోలాటాలు, బతుకమ్మ పాటలతో మహిళలు సందడి చేశారు. జగ్గారెడ్డి సైతం వారితో కలిసి బతుకమ్మ ఆడారు.

గాంధీభవన్​లో బతుకమ్మ వేడుకలు

ఇదీ చదవండి:KTR tour in Sircilla: బంధువుల ఇంటికి మంత్రి కేటీఆర్.. ఏమైందంటే?

ABOUT THE AUTHOR

...view details