తెలంగాణ

telangana

ETV Bharat / state

బతుకమ్మ సంబురానికి జీహెచ్​ఎంసీ ఏర్పాట్లు - chittu chittula

ఒక్కేసి పువ్వువేసి చంద‌మామ అంటూ... వాడవాడ గాన‌సంద్రంలో ఓల‌లాడుతోంది. సద్దుల బతుకమ్మకు జీహెచ్​ఎంసీ భారీ ఏర్పాట్లు చేసింది. ఎల్బీస్టేడియం నుంచి ట్యాంక్​బండ్​ వరకు నిర్వహించే బతుకమ్మ శోభాయాత్ర... నిమజ్జనం చేసే బతుకమ్మ ఘాట్​లో ఏర్పాట్లు పూర్తి చేసింది.

bathukamma-arrangements-at-tank-bund

By

Published : Oct 6, 2019, 11:08 AM IST

ఇవాళ ఉదయం నుంచి ఎల్బీ స్టేడియానికి మహిళలు చేరుకుని బతుకమ్మను పేరుస్తారు. మధ్యాహ్న భోజనం అనంతరం ఎల్బీస్టేడియం నుంచి మధ్యాహ్నం 3 గంటలకు మహిళలు బతుకమ్మలతో ట్యాంక్​బండ్​ వరకు ఊరేగింపుగా వచ్చి బతుకమ్మ ఆడుతారు.

బతుకమ్మ సంబురానికి జీహెచ్​ఎంసీ ఏర్పాట్లు

ప్రత్యేక ఘాట్​

ఈ కార్యక్రమ నిర్వహణకు పర్యటక, సాంస్కృతిక శాఖలతో పాటు జీహెచ్​ఎంసీ పలు ఏర్పాట్లు చేపట్టింది. బతుక‌మ్మ పండుగ‌కు ట్యాంక్‌బండ్ స‌మీపంలో ఉన్న బ‌తుక‌మ్మఘాట్‌ను జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధం చేశారు. ట్యాంక్‌బండ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో బ‌తుక‌మ్మ ఆడే మ‌హిళ‌లు... ట్యాంక్‌బండ్‌లో నిమ‌జ్జనం చేయ‌డానికి ఘాట్‌ను జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా నిర్మించింది. ఈ ఘాట్ చుట్టూ ప్రత్యేకంగా మంచినీరు ఉండేలా నిర్మాణాన్ని చేప‌ట్టింది.

సద్దుల బతుకమ్మ సందర్భంగా

ఈరోజు జరిగే సద్దుల బతుకమ్మ పండుగ‌ను పుర‌స్కరించుకొని బ‌తుక‌మ్మఘాట్‌కు పూర్తిస్థాయిలో మ‌ర‌మ్మతులు నిర్వహించ‌డం, ప‌రిస‌ర ప్రాంతాల‌లో వ్యర్థాలు, పిచ్చి చెట్లను తొల‌గించి ప‌రిశుభ్రప‌రిచే ప్రక్రియ‌ను జీహెచ్ఎంసీ చేప‌ట్టింది.

6వేల మంది

దాదాపు 6వేల మంది మహిళలు హాజరుకానున్నారు. ప్రతి జోన్​ నుంచి వెయ్యి మంది స్వయం సహాయక బృందాల మహిళలు హాజరయ్యేలా 120 వాహనాలను జీహెచ్​ఎంసీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది.

ఈ కథనం చదవండి: ప్రభుత్వం మొండి వైఖరి మానుకోవాలి

ABOUT THE AUTHOR

...view details