తెలంగాణ

telangana

ETV Bharat / state

లైసెన్స్ గడువు ముగిసినప్పటికీ... నెలరోజుల పాటు అనుమతి - Bars license expires news

రాష్ట్రంలోని బార్‌ అండ్‌ రెస్ట్రారెంట్లకు లైసెన్స్‌ గడువు ముగిసినప్పటికీ... నెల రోజులపాటు నడవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొత్తగా లైసెన్స్‌ ఫీజు చెల్లించాలని స్పష్టం చేయకుండానే నెల రోజులు పొడిగింపునకు అవకాశం కల్పిస్తూ అబ్కారీ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

లైసెన్స్ గడువు ముగిసినప్పటికీ... నెలరోజుల పాటు అనుమతి
లైసెన్స్ గడువు ముగిసినప్పటికీ... నెలరోజుల పాటు అనుమతి

By

Published : Oct 7, 2020, 11:43 PM IST

రాష్ట్రంలోని బార్‌ అండ్‌ రెస్ట్రారెంట్లకు లైసెన్స్‌ గడువు ముగిసినప్పటికీ... నెల రోజులపాటు నడవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆరు నెలలకుపైగా మూతపడిన బార్లను తెరచుకోడానికి గత నెల 25న అనుమతి ఇవ్వగా కొత్తగా లైసెన్స్‌ ఫీజు చెల్లించాలని స్పష్టం చేయకుండానే నెల రోజులు పొడిగింపునకు అవకాశం కల్పిస్తూ అబ్కారీ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

అదనంగా...

లాక్‌డౌన్‌ వల్ల మూతపడిన 194 రోజులకు లైసెన్స్‌ ఫీజు చెల్లించినందున ఆ కాలాన్ని తమకు అదనంగా ఇవ్వాలని అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు ఇదివరకే తెలంగాణ రాష్ట్ర బార్‌ అండ్‌ రెస్ట్రారెంట్ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌ గౌడ్‌ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పబ్‌లు, క్లబ్‌లకు జూన్‌ చివర నాటికే లైసెన్స్‌ గడువు ముగియగా బార్‌ అండ్‌ రెస్ట్రారెంట్లకు గత నెల 30 నాటికి ముగిసింది.

గత నెల 25న...

రాష్ట్రంలో బార్‌లు తెరచుకోడానికి గత నెల 25న రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆరు నెలలకుపైగా మూతపడి ఉండగా... అపరిశుభ్రంగా ఉన్న వాటిని శుభ్రం చేసుకుని, వర్కర్స్‌ను పురమాయించుకోవడం లాంటివి సిద్ధం చేసుకునేందుకు మూడు నాలుగు రోజులు పట్టింది. తీరా... అన్నీ సర్దుకుని తెరచేప్పటికీ గడువు ముగిసింది.

పరిశీలనలో...

అప్పటికే బార్‌ అండ్‌ రెస్ట్రారెంట్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు మనోహర్‌ గౌడ్‌ కొవిడ్‌ సమయంలో మూతపడ్డ సమయానికి పాత లైసెన్స్‌ మీదనే బార్లు నడుపుకోడానికి అవకాశం ఇవ్వాలని చేసిన విజ్ఞప్తి ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఇంతలో అబ్కారీ శాఖ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఈ నెలాఖరు వరకు బార్లు నడుపుకోడానికి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

పెండింగ్ లో...

బార్‌ అండ్‌ రెస్ట్రారెంట్ల అసోసియేషన్‌ ఇచ్చిన వినతిని దృష్టిలో మూతపడిన 194 రోజులు పాత లైసెన్స్‌లపై నడుపుకోడానికి అనుమతి ఇచ్చే విషయంలో సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇప్పటికే తెలంగాణ లిక్కర్‌ అసోసియేషన్‌ లాక్‌డౌన్‌ సందర్బంగా మూతపడిన 45 రోజుల సమయాన్ని తమకు అదనంగా పాత లైసెన్స్‌లపై నడుపుకోడానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన వినతి పెండింగ్‌లో ఉంది.

94రోజులు...

ఈ నేపథ్యంలో బార్‌ అండ్‌ రెస్ట్రారెంట్లకు మూడపడిన 94 రోజులు పాత లైసెన్స్‌ల మీద కొనసాగడానికి అవకాశం ఇచ్చినట్లయితే... దుకాణదార్లకు కూడా అవకాశం కల్పించాల్సి వస్తుందని అబ్కారీ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం బార్‌ అండ్‌ రెస్ట్రారెంట్లకు అదనంగా సమయం ఇస్తుందా లేదా అని వేచి చూడాల్సి ఉంది.

ఇదీ చదవండి :శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శం : కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details