నాయీబ్రాహ్మణుల్లో 90 శాతం మంది కులవృత్తి మీదే ఆధారపడి జీవిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 17,500 క్షౌరశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 50 వేల మంది వరకు పనిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 వేల దుకాణాల ద్వారా రెండు లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఎంబీఏ, బీటెక్, ఎంటెక్ విద్యార్హతలు ఉన్నవాళ్లు కూడా రుసుముల చెల్లింపు, వసతిగృహాల అద్దెల కోసం క్షౌరవృత్తి చేస్తున్నారు.
అద్దెల కోసం ఒత్తిడి
సెలూన్స్ నడిపే వారిలో అత్యధికులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని దుకాణాలు పెట్టుకున్నారు. ఇప్పుడు కిస్తీలు కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెలూన్లు గత నాలుగు వారాలుగా మూతబడ్డాయి. క్షౌరవృత్తిదారులు ఇంటికే పరిమితమయ్యారు. సెలూన్లలో పనిచేసే వారిలో ఎక్కువ శాతం అద్దె ఇళ్లలోనే ఉంటున్నారు. అద్దెల కోసం ఒత్తిడి పెరిగిందని వాపోతున్నారు.