దక్షిణ భారతదేశంలోనే కోటి మంది జనాభాతో హైదరాబాద్ పెద్ద నగరంగా ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. జనాభాతో పాటు అదే స్థాయిలో రకరకాల కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అందువల్లే అదనపు జడ్జిలు కావాలని కోరామని తెలిపారు.
KISHAN REDDY:'న్యాయవాదులకు కేంద్ర సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి' - hyderabad latest news
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని బార్ కౌన్సిల్, సీనియర్ న్యాయవాదులు కలిశారు. హైకోర్టులో జడ్జిల సంఖ్య 24 నుంచి 42కు పెరిగేందుకు తనవంతు కృషి చేసినందుకు అభినందనలు తెలిపారు. న్యాయవాదులకు కేంద్రం సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు.

Bar Council, senior lawyers met Union Minister Kishan Reddy
హైకోర్టులో జడ్జిల సంఖ్య 24 నుంచి 42కు పెరిగేందుకు తనవంతు కృషి చేసిన కిషన్‌రెడ్డిని హైదర్‌గూడలోని క్యాంపు కార్యాలయంలో బార్ కౌన్సిల్, సీనియర్ న్యాయవాదులు కలిశారు. ఈ మేరకు మంత్రికి శాలువా కప్పి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాదులకు కేంద్రం సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: TSRTC CCS: అప్పు చెల్లించకపోతే... దివాళా తీయాల్సిందే