తెలంగాణ

telangana

ETV Bharat / state

'న్యాయవాదుల హత్యలపై స్వతంత్ర న్యాయవిచారణ జరిపించాలి' - హైకోర్టు న్యాయవాదుల హత్య కేసు వార్తలు

హైకోర్టు న్యాయవాదులు వామనరావు, నాగమణిల హత్యలపై స్వతంత్ర న్యాయవిచారణ కోసం సీజే జస్టిస్​ హిమా కోహ్లికి లేఖ రాయాలని బార్​ కౌన్సిల్​ తీర్మానించింది. ఈమేరకు సీజేను కలిసిన రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

bar council of India
'న్యాయవాదుల హత్యలపై స్వతంత్ర న్యాయవిచారణ జరిపించాలి'

By

Published : Feb 19, 2021, 8:24 AM IST

న్యాయవాద దంపతుల హత్యలపై నిష్పాక్షిక, స్వతంత్ర న్యాయవిచారణ జరిపించాలని బార్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా డిమాండ్‌ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర పోలీసులు నిష్పాక్షికమైన దర్యాప్తు చేసే పరిస్థితి లేదని అభిప్రాయపడింది. ఈ మేరకు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌, సీనియర్‌ అడ్వొకేట్‌ మనన్‌కుమార్‌ మిశ్రా ఓ ప్రకటన విడుదల చేశారు.

మంథని కస్టోడియల్‌ మరణంపై పిల్‌ దాఖలు చేయడంతో పాటు అధికార పార్టీకి చెందిన నాయకుడికి వ్యతిరేకంగా కేసులు వాదిస్తున్నందుకే ఈ భయంకరమైన దాడి జరిగినట్లు దిగ్భ్రాంతికి గురయ్యామని తెలిపారు. స్వతంత్ర న్యాయవిచారణ జరిపించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లికి లేఖ రాయాలని బార్‌ కౌన్సిల్‌ తీర్మానించింది.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లిని రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు కలిశారు. వామన్​ రావు, నాగమణి న్యాయవాద దంపతుల హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని సీజేను బార్ కౌన్సిల్ కోరింది. విచారణ త్వరితగతిన పూర్తిచేసి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీచూడండి:బిట్టు శ్రీను... లాయర్‌ దంపతుల హత్య కేసులో కొత్త పేరు

ABOUT THE AUTHOR

...view details