తెలంగాణ

telangana

By

Published : Jun 12, 2021, 7:21 PM IST

ETV Bharat / state

సీజేఐని సత్కరించిన బార్​ కౌన్సిల్​, హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రతినిధులు

సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణను రాష్ట్ర బార్​ కౌన్సిల్, హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రతినిధులు సత్కరించి అభినందనలు తెలిపారు. హైకోర్టు జడ్జిలను 22 నుంచి 42కు పెంచినందుకు సీజేఐకి ధన్యవాదాలు తెలిపారు.

cji justice ramana
సీజేఐని సత్కరించిన బార్​ కౌన్సిల్​, హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రతినిధులు

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను రాష్ట్ర బార్​ కౌన్సిల్, హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రతినిధులు సత్కరించారు. రాజ్​భవన్​లో జస్టిస్ ఎన్వీ రమణను కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపిన న్యాయవాదుల ప్రతినిధులు.. సీజేఐగా నియామకం తెలుగు ప్రజలకు గర్వకారణంగా పేర్కొన్నారు. హైకోర్టు జడ్జిలను 22 నుంచి 42కు పెంచినందుకు సీజేఐకి ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ న్యాయవాదుల సంక్షేమానికి చొరవ తీసుకోవాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ ఛైర్మన్ ఎ.నర్సింహారెడ్డి కోరారు. శామీర్​పేటలో న్యాయవాదుల శిక్షణ సంస్థ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారు. హైకోర్టులో సన్మాన కార్యక్రమానికి హాజరు కావాలని కోరగా.. సుముఖంగా స్పందించారని నర్సింహారెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:nv ramana: సోమవారం యాదాద్రికి జస్టిస్ ఎన్వీ రమణ

ABOUT THE AUTHOR

...view details