తెలంగాణ

telangana

ETV Bharat / state

'బ్యాంకర్లు, వారి కుటుంబీకులకు వ్యాక్సిన్​ వేయించుకునేందుకు అనుమతి' - dh srinivasa rao latest news

రాష్ట్రంలో 18 ఏళ్లు, ఆపై వయసు కలిగిన బ్యాంకర్లు, వారి కుటుంబసభ్యులు కరోనా వ్యాక్సిన్​ తీసుకునేందుకు అనుమతిస్తున్నట్లు డీహెచ్​ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించారు.

బ్యాంకర్లు, వారి కుటుంబీకులు వ్యాక్సిన్​ వేయించుకునేందుకు అనుమతి
బ్యాంకర్లు, వారి కుటుంబీకులు వ్యాక్సిన్​ వేయించుకునేందుకు అనుమతి

By

Published : May 25, 2021, 8:59 PM IST

రాష్ట్రంలో బ్యాంకర్లు, వారి కుటుంబసభ్యులు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్​ శ్రీనివాసరావు పేర్కొన్నారు. 18 ఏళ్లు, ఆపై వయసు కలిగిన వారందరూ ఇందుకు అర్హులని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించారు.

అన్ని ఆర్థిక సంస్థలు, రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, నాబార్డు సంస్థలకు అనుమతి ఇస్తున్నట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆసుపత్రులతో ఒప్పందం చేసుకుని, పని చేసే చోటే వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి కొవిన్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. ఈ మేరకు ఎస్ఎల్‌బీసీ కన్వీనర్‌, ఆర్బీఐ ప్రాంతీయ మేనేజర్‌, నాబార్డు సీజీఎంకు సమాచారం ఇచ్చినట్లు ఆయన వివరించారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 3,821 కరోనా కేసులు, 23 మరణాలు

ABOUT THE AUTHOR

...view details