తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్త రిజిస్ట్రేషన్ ప్రక్రియను బ్యాంకర్లకు వివరించిన సీఎస్ - Secretariat news

హైదరాబాద్ ​సచివాలయంలో బ్యాంకర్లతో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్​ కుమార్ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, ఎస్సెల్బీసీ కన్వీనర్ కృష్ణన్ శర్మతో పాటు ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.

బ్యాంకర్లతో సీఎస్ సోమేశ్​కుమార్ సమావేశం
బ్యాంకర్లతో సీఎస్ సోమేశ్​కుమార్ సమావేశం

By

Published : Dec 16, 2020, 8:56 PM IST

వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల కొత్త రిజిస్ట్రేషన్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లకు వివరించింది. ఇందుకోసం బ్యాంకర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్ సచివాలయంలో సమావేశమయ్యారు. ఉన్నతాధికారులు, ఎస్సెల్బీసీ కన్వీనర్ కృష్ణన్ శర్మతో పాటు ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకుల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.

కొత్త విధానంలో బ్యాంకింగ్, మార్ట్​గేజ్ మాడ్యూల్స్​కు సంబంధించి సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. బ్యాంకర్లకున్న సందేహాలను నివృత్తి చేశారు. మాడ్యూల్స్​ను ప్రశంసించిన బ్యాంకర్లు... వ్యవస్థలో పారదర్శకతను తీసుకొస్తుందన్నారు. రిజిస్ట్రేషన్ల విధానానికి సంబంధించి ప్రభుత్వానికి, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని బ్యాంకర్లు హామీ ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇదీ చూడండి:ధరణి సమస్యలను పరిష్కరిస్తామన్నారు: ట్రెసా

ABOUT THE AUTHOR

...view details