రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండడంతో బ్యాంకర్లు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యలు తీసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఆయా బ్యాంకుల యాజమాన్యాలు రాష్ట్రంలోని బ్రాంచిలకు ఆదేశాలిచ్చాయి. ఖాతాదారులకు సేవలు అందించే సమయంలో... తగిన సామాజిక దూరం ఉండేట్లు చూడాలని, శానిటైజర్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించాయి.
అప్రమత్తమైన బ్యాంకులు... సూచనలు చేస్తూ ఆదేశాలు - కరోనా నియమాలు
కరోనా కేసులు పెరుగుతున్న వేళ తగిన సూచనలు చేస్తూ... ఆయా బ్యాంకుల యాజమాన్యాలు బ్రాంచిలకు ఆదేశాలిచ్చాయి. మాస్క్‌లు ధరించడం, రద్దీ అధికంగా ఉండే బ్రాంచిల్లో ఫేస్ షీల్డ్ కూడా ఉద్యోగులు తప్పనిసరిగా వాడాలని స్పష్టం చేశాయి.
మాస్క్‌లు ధరించడం, రద్దీ అధికంగా ఉండే బ్రాంచిల్లో ఫేస్ షీల్డ్ కూడా ఉద్యోగులు తప్పనిసరిగా వాడాలని స్పష్టం చేశాయి. ఇప్పటికే... కొవిడ్ నిరోధానికి బ్రాంచిల్లో అవసరమైన శానిటైజర్లు, మాస్క్‌లు, ఫేస్ షీల్డ్ స్థానికంగా కొనుగోలు చేసుకోడానికి బ్యాంకుల యాజమాన్యాలు అనుమతి ఇచ్చాయి. భారతీయ స్టేట్ బ్యాంకు తెలంగాణ రాష్ట్ర సీజీఎం ఓపీ మిశ్ర మరొక అడుగు ముందుకు వేసి... మే15వ తేదీ వరకు ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదని ఎస్బీఐ ప్రతినిధులను ఆదేశించారు. శాఖాపరంగా ఏదైనా అవసరం ఉన్నట్లయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ కావాలని స్పష్టం చేశారు. ఉద్యోగులు నిర్లక్ష్యం ప్రదర్శించకుండా... కొవిడ్ నిబంధనలను అమలు చేయాలని ఆదేశించారు.
ఇదీ చూడండి:మద్యం దుకాణాలు, థియేటర్లపై కరోనా ఆంక్షలేవీ..?: హైకోర్టు