నెక్లెస్ రోడ్లో సంజీవయ్య పార్క్ నుంచి జల విహార్ వరకు బ్యాంక్ ఆఫ్ బరోడా 5కె రన్ జరిగింది. ఈ పరుగులో పెద్ద సంఖ్యలో బ్యాంక్ ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి వ్యవస్థాపక దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు.
సందడిగా బీవోబీ వ్యవస్థాపక దినోత్సవం - bank of baroda
హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో బ్యాంక్ ఆఫ్ బరోడా 5కె రన్ నిర్వహించింది. బ్యాంక్ 112వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టింది.
సందడిగా బీవోబీ వ్యవస్థాపక దినోత్సవం
బ్యాంకులో రూ.400కోట్ల డిపాజిట్లు
బ్యాంక్లో విజయ, దేనా బ్యాంక్లు విలీనం అయినప్పటి నుంచి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తున్నామని జనరల్ మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. సంస్థ రోజువారీ వ్యాపారం 15లక్షల కోట్లకు చేరిందన్నారు. ప్రస్తుతం తమ వద్ద డిపాజిట్స్ 400కోట్లకు చేరుకున్నాయని శ్రీనివాస్ తెలిపారు.
ఇదీ చూడండి: ట్రక్కును ఢీకొన్న కారు...9 మంది విద్యార్థులు మృతి
Last Updated : Jul 20, 2019, 11:53 AM IST