తెలంగాణ

telangana

By

Published : Jan 10, 2023, 11:01 PM IST

ETV Bharat / state

'వాళ్లు తీసుకున్న అప్పు మేము తీర్చాలంటూ తిడుతున్నారు సార్​'

'ఆ బకాయికి మాకు ఎలాంటి సంబంధం లేదు. అయినా రోజుకో నెంబర్​ నుంచి ఫోన్​ చేసి అప్పు కట్టాలంటూ వేధిస్తున్నారు. బ్యాంకు అధికారుల పేరిట రోజుకు 20 నుంచి 50కి పైగా ఫోన్​ కాల్స్​ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. నిందితులపై కొంచెం చర్యలు తీసుకోండి సార్​' అంటూ పలువురు మహిళలు పోలీసులను ఆశ్రయించారు. అసలు ఆ అప్పు ఏంటి.. వీరికి ఫోన్​ చేసి వేధించడం ఏంటి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

loan harrasments
loan harrasments

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలోని జనచైతన్య కాలనీకి చెందిన వడ్డె రవికుమార్, వడ్డె వరలక్ష్మి అప్పు ఉన్నారని.. ఆ బకాయి మొత్తాన్ని చెల్లించాలంటూ బ్యాంక్ అధికారుల పేరిట ఫోన్​ చేసి వేధిస్తున్నారని అదే కాలనీకి చెందిన పలువురు మహిళలు అనంతపురం డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఒక్కోసారి ఒక్కో బ్యాంకు పేరు చెప్పి తీసుకున్న డబ్బులు చెల్లించాలని.. అసభ్యకరంగా తిడుతూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వారం రోజుల నుంచి రోజుకు 20 నుంచి 50కి పైగా ఫోన్ కాల్స్ చేసి.. వడ్డే రవికుమార్, వడ్డే వరలక్ష్మి తీసుకున్న అప్పు చెల్లించాలని వేధింపులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని వరలక్ష్మి, వడ్డె రవికుమారులను కలిసి అడగ్గా.. ఆ నెంబర్ల నుంచి వచ్చే ఫోన్​లో మాట్లాడవద్దని చెబుతున్నారని వాపోయారు. లోన్ యాప్​ల వేధింపుల కన్నా దారుణంగా ఉన్నాయని.. అధికారులు చర్యలు తీసుకొని నిందితులపై చర్యలు తీసుకోవాలని బాధిత మహిళలు కోరారు.

'వాళ్లు తీసుకున్న అప్పు మమ్మల్ని తీర్చమంటున్నారు సార్​'

ABOUT THE AUTHOR

...view details