తెలంగాణ

telangana

ETV Bharat / state

కేంద్రం దిగిరాకపోతే ప్రజా ఉద్యమంగా మారుస్తాం: బ్యాంక్ ఉద్యోగులు - తెలంగాణ వార్తలు

బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని బ్యాంక్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న బ్యాంకర్ల సమ్మెకు మద్దతు తెలుపుతూ హైదరాబాద్‌లో ధర్నా చేపట్టారు. కేంద్రం దిగిరాకపోతే దీనిని ప్రజా ఉద్యమంగా మారుస్తామని హెచ్చరించారు.

bank-employees-protest-at-koti-sbi-bank-in-hyderabad
కేంద్రం దిగిరాకపోతే ప్రజా ఉద్యమంగా మారుస్తాం: బ్యాంక్ ఉద్యోగులు

By

Published : Mar 15, 2021, 4:35 PM IST

భాజపా ప్రభుత్వంలో ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని బ్యాంక్ యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్యతిరేకంగా బ్యాంక‌ర్లు స‌మ్మెకు పిలుపునివ్వడంతో... హైదరాబాద్‌లోని కోఠి ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియ‌న్స్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ఆందోళనలో బ్యాంక్ ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

దేశ‌వ్యాప్తంగా దాదాపు ప‌దిల‌క్షల మంది ఉద్యోగులు ఈ స‌మ్మెలో పాల్గొన్నారని యూనియన్ ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదనను ఉపసహరించుకునేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేంద్రం దిగిరాకపోతే ప్రజా ఉద్యమంగా మారుస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:జలాశయంలో మునిగి ఐదుగురు దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details