తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల బ్యాంకుల బ్రాంచిలు 5,781 ఉండగా.. అందులో 1,171 బ్రాంచిలతో భారతీయ స్టేట్ బ్యాంకు మొదటి స్థానంలో ఉండగా, 780 బ్రాంచిలతో యూనియన్ బ్యాంకు ఆ తరువాత స్థానంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల్లో మొత్తం 75.64లక్షల ఖాతాలు ఉన్నట్లు ఎస్ఎల్‌బీసీ వెల్లడించింది. కొవిడ్ ప్రభావంతో మార్చి చివరి వారం నుంచి రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా అన్ని వ్యవస్థలు స్తంభించాయి. అత్యవసర సేవకులు తప్ప ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఆర్థికంగా చితికిపోవడంతో కొన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. అంతేకాదు.. చాలా ప్రైవేటు సంస్థల్లో పనిచేసే పలువురు ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో.. డబ్బున్న వారు కూడా పెట్టుబడులు పెట్టడానికి ధైర్యం చేయలేకపోయారు. తమ వద్ద ఉన్న నగదును తమ బ్యాంకుల్లో దాచుకోవాల్సి వచ్చింది.
కొవిడ్ సంక్షోభం సమయంలో బ్యాంకుల్లో పెరిగిన డిపాజిట్లు - కొవిడ్ సమయంలో బ్యాంకుల్లో పెరిగిన డిపాజిట్లు
కరోనాతో వ్యవస్థలన్నీ స్తంభించి ఆర్థిక ఇబ్బందులతో ప్రజలు సతమతమవుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర బ్యాంకుల్లో యాభై వేల కోట్లు రూపాయలు డిపాజిట్లు పెరిగాయి. ఇదే సమయంలో ఆర్థికంగా చితికిపోతున్న వివిధ రంగాలకు బ్యాంకులు 14వేల కోట్లు రుణాలు ఇచ్చాయి. రుణాల్లో సింహభాగం వ్యవసాయరంగానికి చెందినవికాగా.. చిన్న, మధ్యతరహా పరిశ్రమల రుణాలు ఆ తరువాత స్థానంలో ఉన్నాయి.
మార్చి వరకు రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల్లో రూ.4.84లక్షల కోట్లు డిపాజిట్లు ఉండగా.. సెప్టెంబరు చివరి నాటికి అవి రూ. 5.34లక్షల కోట్లకు పెరిగాయి. అంటే కొవిడ్ సమయంలో ఆరు నెలల కాలంలో రూ.49వేల కోట్ల మేర డిపాజిట్లు పెరిగి 10.6శాతం వృద్ధి నమోదు చేసినట్లు బ్యాంకర్లు తెలిపారు. అదే విధంగా మార్చి చివరి నాటికి రాష్ట్రంలోని అన్ని బ్యాంకులు రూ. 5.70లక్షల కోట్లు ఇచ్చిన రుణాలు ఉండగా.. అదే సెప్టెంబరు చివరి నాటికి రూ.5.84లక్షల కోట్లకు రుణాలు పెరిగాయి. అంటే ఈ ఆరు నెలల్లో వివిధ వర్గాలకు రూ.14వేల కోట్ల మొత్తాన్ని బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. సెప్టెంబరు వరకు బ్యాంకులు ఇచ్చిన రుణాలను పరిశీలిస్తే అత్యధికంగా వ్యవసాయానికి రూ.83,760 కోట్లు, చిన్న,మధ్యతరహా పరిశ్రమలకు రూ.62,830 కోట్లు రుణాలు ఉండగా.. గృహనిర్మాణ రంగానికి రూ.30,980 కోట్లు రుణాలు ఔట్ స్టాండింగ్ ఉన్నట్లు బ్యాంకర్లు వివరించారు.
ఇవీ చూడండి: బీబీనగర్ ఎయిమ్స్‌లో పునఃప్రారంభమైన ఓపీ సేవలు