Banjarahills CI Bribe Case Updates : బంజారాహిల్స్ పోలీసుల వసూళ్ల పర్వంపై అవినీతి నిరోధక శాఖ అధికారుల దర్యాప్తు ముమ్మరమైంది. రాక్‌పబ్ నిర్వాహకుల నుంచి రూ.3 లక్షలు డిమాండ్ చేశారనే ఆరోపణలతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు తీగ లాగితే డొంక కదిలింది. పోలీస్‌స్టేషన్ పరిధిలోని పబ్‌లు, మసాజ్ కేంద్రాల నుంచి ముడుపులు, సివిల్ తగాదాల్లో చేతులు మారుతున్న కమీషన్లపై అనిశా అధికారుల బృందం ఆరా తీసింది.
ACB Investigation in Banjarahills CI Bribe Case : కొందరు బాధితుల నుంచి పోలీసుల వ్యవహారం గురించి ఏసీబీ అధికారులు అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. సేకరించిన ఆధారాలు, సమాచారం ఆధారంగా సీఐ నరేందర్ (Banjarahills CI Narender), ఎస్‌ఐ నవీన్‌రెడ్డి, హోంగార్డు హరిని మరింత లోతుగా ప్రశ్నించనున్నారు. రాక్‌పబ్ వ్యవహారంలో అనిశా బృందం ఇప్పటికే సీసీ కెమెరాల ఫుటేజ్ సేకరించారు. అర్ధరాత్రి సమయంలో పబ్ యజమానిని పోలీస్‌స్టేషన్‌కు ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో తెలుసుకున్నారు.
TU VC Ravinder Caught by ACB Officials : ఏసీబీకి చిక్కిన తెలంగాణ వర్సిటీ వీసీ రవీందర్
నిర్వాహకులు నిర్దేశించిన సమయం ముగిసినప్పటికీ.. పట్టించుకోకుండా పబ్ తెరిచి ఉంచడాన్ని ఎస్‌ఐ నవీన్‌రెడ్డి గమనించి సీఐ నరేందర్‌కు చెప్పాడు. అయితే సీఐ ఆదేశాలతో పబ్ యజమానిని తీసుకువచ్చినట్టు నవీన్‌రెడ్డి ఏసీబీకి వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. నిబంధనల ప్రకారం పబ్ కొనసాగిస్తున్నా.. తమను బంజారాహిల్స్ పోలీసులు ఉద్దేశపూర్వకంగానే వేధించారంటూ పబ్ నిర్వాహకులు అనిశాకు (ACB) వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది.
ACB Investigation Banjarahills Police : దర్యాప్తులో వెల్లడయ్యే అంశాల నేపథ్యంలో పోలీసు అధికారులు చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నరేందర్, ఎస్‌ఐ నవీన్‌రెడ్డిపై అంతర్గత విచారణ జరుగుతున్నట్టు తెలుస్తోంది. తద్వారా వచ్చే నివేదిక ఆధారంగా వారిపై వేటు పడే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో పలువురు పోలీసు అధికారులు బంజారాహిల్స్ సీఐ పోస్టింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.