Nandakumar in Police custody : ఎమ్మెల్యేలకు ఎర కేసు ప్రధాన నిందితుల్లో ఒకరైన నందకుమార్‌ను బంజారాహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. మొదటి రోజు ఐదున్నర గంటల పాటు పోలీసులు విచారణ చేపట్టారు. అడ్వాకేట్ నాగరాజు సమక్షంలో విచారణ కొనసాగింది. ఫిలింనగర్‌లోని దక్కన్ కిచెన్ స్థలాన్ని సబ్ లీజుకు ఇచ్చి డబ్బులు వసూలు చేశారన్న కేసు దర్యాప్తులో భాగంగా నందకుమార్ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న నందకుమార్‌ను.. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం బంజారాహిల్స్ పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. దక్కన్ కిచెన్ స్థలం లీజ్, సబ్ లీజుకు సంబంధించి నందకుమార్‌ను ప్రశ్నించారు. ఆర్ధిక లావాదేవీలు, లీజ్ అగ్రిమెంట్ విషయాలపై ప్రశ్నలు సంధించిన పోలీసులు... తొలిరోజు విచారణ అనంతరం నందకుమార్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. రేపు మరోమారు నందకుమార్‌ను ప్రశ్నించనున్నారు.
తొలిరోజు ముగిసిన నందకుమార్ కస్టడీ విచారణ.. 5 గంటల పాటు ప్రశ్నల వర్షం - Nandakumar latest news
Nandakumar in Police custody : 'ఎమ్మెల్యేలకు ఎర' కేసు నిందితుడు నందకుమార్ బంజారాహిల్స్ పోలీసుల విచారణ ముగిసింది. నందకుమార్‌ను బంజారాహిల్స్ పీఎస్‌లో పోలీసులు ప్రశ్నించారు. తొలిరోజు విచారణ అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. రేపు మరోమారు నందకుమార్‌ను ప్రశ్నించనున్నారు.
Nandakumar
ఫిలింనగర్‌లోని దక్కన్ కిచెన్ విషయంలో నందకుమార్‌పై కేసు నమోదైంది. హీరో దగ్గుబాటి రానా, నిర్మాత సురేశ్ బాబులకు సంబంధించిన ఈ భూమిని లీజుకు తీసుకున్న నందు.. ఆ ప్రదేశంలో అక్రమ నిర్మాణాలు చేపట్టి సబ్ లీజ్‌కు ఇచ్చి డబ్బులు వసూలు చేశారని ముగ్గురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఐపీసీ సెక్షన్ 406, 420, 506 కింద మూడు వేర్వేరు కేసులు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో భాగంగా నందకుమార్‌ను రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు.
ఇవీ చూడండి..
Last Updated : Nov 28, 2022, 4:36 PM IST
TAGGED:
ఎమ్మెల్యేలకు ఎర కేసు