తెలంగాణ

telangana

ETV Bharat / state

హోటల్​లో విద్యార్థి అనుమానాస్పద మృతి - banglore engeneering Student suspicious death

బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చాడో ఇంజినీరింగ్ విద్యార్థి. శంషాబాద్​లోని ఓ హోటల్​లో రూమ్​ బుక్ చేసుకుని నిన్న సాయంత్రం దిగాడు. తెల్లవారేసరికి శవంగా మారాడు.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

dead
ఓయో హోటల్​లో విద్యార్థి అనుమానాస్పద మృతి

By

Published : Dec 24, 2019, 1:12 PM IST

రంగారెడ్డి జిల్లా శంషాబాద్​లో ఇంజినీరింగ్ విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. బెంగళూరుకు చెందిన సుమిత్ శ్రీవాత్సవ ఓయో హొటల్ 106 రూమ్ బుక్ చేసుకుని నిన్న సాయంత్రం రూమ్​లో దిగాడు. ఈ రోజు ఉదయం తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన హోటల్ మేనేజర్ తలుపు లాక్ తీసి చూడగా అనుమాస్పద స్థితిలో చనిపోయి ఉన్నాడు. వెంటనే హోటల్ సిబ్బంది శంషాబాద్ విమానాశ్రయ పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బెంగళూరులో సుమిత్ శ్రీవాత్సవపై మిస్సింగ్ కేసు నమోదయిందని గుర్తించారు. అసలు సుమిత్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు, తనతో పాటు మరెవరైనా ఉన్నారా... అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఓయో హోటల్​లో విద్యార్థి అనుమానాస్పద మృతి

ఇవీ చూడండి: ఉన్నత విద్య ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details