తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా: ఎంపీ బండి - లాక్​డౌన్​ పొడగింపు నిర్ణయం

కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న లాక్​డౌన్​ పొడిగింపు నిర్ణయాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​కుమార్​ స్వాగతించారు. కరోనా కాలంలో ప్రజలకు సేవ చేయడానికి భాజపా కార్యకర్తలు ముందుకురావడం అభినందనీయమన్నారు.

Bandy Sanjay Kumar welcomed the decision to extend the lock down of CM kcr
సీఎం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా: బండి సంజయ్​కుమార్​

By

Published : Apr 13, 2020, 3:55 AM IST

కరోనా కట్టడి కోసం రాష్ట్రంలో పొడిగించిన లాక్‌డౌన్‌ను ప్రతి ఒక్కరు గౌరవించి, పాటించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. లాక్‌డౌన్‌లో ఉపాధి కోల్పోయిన పేదలకు పాతబస్తీలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న లాక్​డౌన్​ పొడిగింపును స్వాగతిస్తున్నట్లు ఆయన చెప్పారు.

కరోనా నియంత్రణ కోసం ప్రజలంతా సహకారించాలని కోరారు. లాక్‌డౌన్‌ కాలంలో భాజపా కార్యకర్తలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. లాక్‌డౌన్‌ పొడిగింపులో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూనే సేవా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ సభ్యులకు సూచించారు.

ఇదీ చూడండి:కుమారుడి అంత్యక్రియలకు 2,000 కి.మీ ప్రయాణం

ABOUT THE AUTHOR

...view details