తెలంగాణ

telangana

ETV Bharat / state

Bandla Ganesh Clarity on Contesting in Assembly Election : కాంగ్రెస్​ తరఫున అసెంబ్లీ ఎన్నికల బరిలో బండ్ల గణేశ్​.. క్లారిటీ ఇదిగో - Bandla Ganesh Clarity on contesting in election

Bandla Ganesh Clarity on Contesting in Assembly Election : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ తరఫున కూకట్‌పల్లి నుంచి ఎమ్మెల్యేగా బండ్ల గణేశ్ పోటీ చేయనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈసారి జరిగే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదని తెలిపారు. అసలు తాను టికెట్ కోసం కూడా దరఖాస్తు చేసుకోలేదని బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు.

Bandla Ganesh
Bandla Ganesh

By ETV Bharat Telangana Team

Published : Oct 8, 2023, 12:46 PM IST

Bandla Ganesh Clarity on Contesting in Assembly Election : రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో.. కూకట్‌పల్లి స్థానం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ (Bandla Ganesh) పోటీ చేస్తారనే రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై తాజాగా బండ్ల గణేశ్ స్పందించారు. ఈసారి జరిగే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనకు అవకాశం ఇస్తామని చెప్పారని.. కానీ ఈసారి టికెట్ వద్దని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

TPCC Cheif Revanth Reddy Chitchat in Hyderabad : "కాంగ్రెస్‌ వేవ్‌ను ఆపడం ఎవరి తరం కాదు.. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పనైపోయింది"

Bandla Ganesh Tweet on Contesting Kukatpally Constituency : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ముఖ్యమని.. దాని కోసం పని చేస్తానని బండ్ల గణేశ్ తెలిపారు. రేవంతన్న మీ ప్రేమకు కృతజ్ఞుణ్ని అని అన్నారు. తాను టికెట్ కోసం కూడా దరఖాస్తు చేయలేదని పేర్కొన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటమే తన ధ్యేయమని వ్యాఖ్యానించారు. తప్పకుండా పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పని చేస్తామని ఆయన వెల్లడించారు. ఇటీవలే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ పాదయాత్రలో బండ్ల గణేశ్‌ పాల్గొన్నారు. గత ఎన్నికల్లోనూ బండ్ల గణేశ్‌ కాంగ్రెస్‌కు ప్రచారం చేసిన విషయం తెలిసిందే.

Congress Bus Yatra in Telangana : బస్సు యాత్రకు కాంగ్రెస్‌ ప్లాన్.. త్వరలోనే రూట్‌మ్యాప్‌, షెడ్యూల్‌

"నేను ఈసారి జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయను. రేవంత్‌రెడ్డి నాకు ఇప్పుడు అవకాశం ఇస్తాను అని చెప్పారు. కానీ నాకు ఈసారి టికెట్ వద్దు. కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడం ముఖ్యం. దాని కోసం పని చేస్తాను. రేవంతన్న మీ ప్రేమకు కృతజ్ఞుణ్ని. నేను టికెట్ కోసం కూడా దరఖాస్తు చేయలేదు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటమే నా ధ్యేయం. తప్పకుండా అధికారంలోకి వస్తుంది. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పనిచేస్తాం, అధికారంలోకి వస్తాం." - బండ్ల గణేశ్ ట్వీట్

60-70 మంది అభ్యర్థుల ఖరారు..: మరోవైపు శనివారం రాత్రి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్‌ మురళీధరన్‌తో.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (KomatiReddy Venkat Reddy) సమావేశమయ్యారు. తెలంగాణలోని 60-70 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను నేడు జరిగే కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశంలో ఖరారు చేయనున్నట్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 11, 12 తేదీల్లో ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉందని.. అభ్యర్థులను ఖరారు చేస్తే వారంతా ప్రచారం చేసుకోవడానికి వీలవుతుందని తాను మురళీధరన్‌కు చెప్పినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ మాదిరి ముందస్తుగా టికెట్లు ఖరారు చేయడం కాంగ్రెస్‌ లాంటి జాతీయ పార్టీలో సాధ్యం కాదని చెప్పారు. భారత్ రాష్ట్ర సమితి ప్రాంతీయ, కుటుంబ పార్టీ అయినందున ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తోందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Congress Flash Survey Telangana : ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక మీద మరో లెక్క.. టెన్షన్​లో కాంగ్రెస్​ సీనియర్​ నేతలు

BC MLA Ticket issue in Congress Telangana : బీసీలకు 34 సీట్లు.. రాష్ట్ర నేతల డిమాండ్​పై ఏఐసీసీ ఫైర్

ABOUT THE AUTHOR

...view details