తెలంగాణ

telangana

ETV Bharat / state

Bandla Ganesh: నాకెందుకు ఇస్తారయ్యా నోటీసులు... నేనసలు వక్కపోడే వేసుకోను! - Tollywood drugs case updates

టాలీవుడ్​లో మళ్లీ మత్తుమందుల విచారణ మొదలైంది. నాలుగేళ్ల క్రితం తెలుగు సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన డ్రగ్స్ వ్యవహారం మళ్లీ తెరమీదకొచ్చింది. విచారణకు హాజరుకావాల్సిందిగా పలువురు సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు ఇచ్చింది. అందులో భాగంగా మంగళవారం దర్శకుడు పూరీ జగన్నాథ్​ను ఈడీ అధికారులు విచారించారు. పూరీని విచారిస్తుండగా ఈడీ కార్యాలయంలో నిర్మాత బండ్ల గణేశ్​ ప్రత్యక్షమయ్యారు.

bandla
గణేశ్

By

Published : Sep 1, 2021, 8:34 AM IST

Updated : Sep 1, 2021, 9:20 AM IST

టాలీవుడ్ మత్తు మందుల కేసు (Tollywood Drugs Case) తొలిరోజు విచారణలో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(ED) ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్​(Puri Jagannath)ను విచారిస్తుండగా ఈడీ కార్యాలయంలో ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్​ (Bandla Ganesh) ప్రత్యక్షమయ్యారు. ఆయన ఈడీ కార్యాలయానికి రావడం వల్ల అధికారులు ఆయన్నీ పిలిచినట్లు ప్రచారం జరిగింది. అక్కడ మీడియా ప్రతినిధులు ఈడీ ఏమైనా మీకు నోటీసులిచ్చిందా అని అడగ్గా... గణేశ్​ స్పందిస్తూ... నాకు వక్కపోడే తెలియదు. ఈడీ నాకెందుకు నోటీసులు ఇస్తుందని ఎదురప్రశ్న వేశారు. తాను కేవలం పూరీని పలకరించడానికి మాత్రమే వచ్చినట్లు చెప్పారు.

ఈడీ కార్యాలయంలో బండ్ల గణేశ్

చాలాసేపు అయిందని పూరీ జగన్నాథ్​ను కలవడానికి వచ్చాను. నాకెందుకు ఇస్తారయ్యా నోటీసులు? నేను వక్కపొడి కూడా వేసుకోను.

-- బండ్ల గణేశ్​, నిర్మాత

బండ్ల గణేశ్​... పూరీ జగన్నాథ్​ను కలిసేందుకు ప్రయత్నించినా అధికారులు ఆయనను అనుమతించలేదు. అక్కడే ఆయన కాసేపు నిరీక్షించారు. దీంతో కొద్దిసేపు కార్యాలయ ఛాంబర్‌లో కూర్చుని పూరీ తనయుడు ఆకాశ్‌తో మాట్లాడినట్లు తెలిసింది. ఈడీ అధికారులు కార్యాలయం నుంచి వెళ్లిపోవాలని బండ్ల గణేశ్​కు చెప్పగా ఆయన అక్కడి నుంచి రాత్రి 7.45 గంటలకు వెళ్లిపోయారు.

ఇదీ చూడండి: tollywood drugs case: ముగిసిన పూరీ ఈడీ విచారణ.. అవసరమైతే మరోసారి..!

Last Updated : Sep 1, 2021, 9:20 AM IST

ABOUT THE AUTHOR

...view details