Bandi Sanjay fire on Congress And BRS : తెలంగాణలో జరిగిన ఉపఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పొందిన విషయాన్ని మరచిపోయి కాంగ్రెస్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆ పార్టీ నేతలు పగటి కలలు కంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ఇలాంటి క్రైమ్, కరప్షన్ టీపీసీసీ కళంకిత రాజకీయ నాయకులే గాలిలో కోటలు నిర్మిస్తారని దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Bandi Sanjay Tweet Today : కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఏమి జరుగుతుందో ట్రైలర్లో కనిపిస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. అక్కడి పాలకులు హిందువులపై మతమార్పిడి నిరోధక చట్టాన్ని రద్దు చేశారని మండిపడ్డారు. కర్ణాటక పాఠ్యపుస్తకాల్లో హెడ్గేవార్, సావర్కర్ చరిత్రలను తీసేసి.. ఒసామా బిన్ లాడెన్, కసబ్ లాంటి ఉగ్రవాదులపై చాప్టర్లు చెబుతారా ఏంటని ప్రశ్నించారు. ఆ రాష్ట్రంలో బియ్యం పంపిణీ పథకం చాలా లోపభూయిష్ఠంగా జరుగుతోందన్నారు. అదానీ వద్దని చెప్పిన రాహుల్‌గాంధీనే.. కర్ణాటకలో పెట్టుబడులకు పెట్టేందుకు అదానీని ఆహ్వానించారని బండి సంజయ్ తెలిపారు.
Bandi Sanjay Tweet On KCR : రాష్ట్రంలో పింఛన్లు, ధరణి, సంక్షేమ పథకాలపై అనిశ్చితి ఏర్పడిందని బండి సంజయ్ ట్విటర్లో ఆరోపించారు. ఇదికాక మరోవైపు కాంగ్రెస్ ఈ విషయాలపై అనిశ్చితిని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. మరోవైపు వచ్చే శాసనసభ ఎన్నికలో అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు అందవని.. స్వయంగా బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్లో అశాంతిని సృష్టిస్తున్నారని బండి సంజయ్ దుయ్యబట్టారు.