తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓవైపు బండి ప్రసంగిస్తుండగానే.. మరో వైపు ఈటల ప్రసంగం..

Bandi Sanjay vs Etela Rajender: హైదరాబాద్​లో బీజేపీ ఏర్పాటు చేసిన పోలీంగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఓ వైపు బండి సంజయ్ ప్రసంగిస్తుండగానే.. మరో వైపు ఈటల రాజేందర్ ప్రసంగించడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై పార్టీ వర్గాలు ఆరా తీస్తున్నాయి.

BJP
BJP

By

Published : Jan 7, 2023, 5:45 PM IST

Bandi Sanjay vs Etela Rajender: హైదరాబాద్​లో బీజేపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పోలీంగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే నేతల మధ్య సమన్వయ లోపం బయటపడింది. ఓ వైపు బండి సంజయ్ ప్రసంగ సమయంలోనే.. మరో వైపు ఈటల రాజేందర్ ప్రసంగించారు. వరంగల్ తూర్పు నుంచి ఈటల రాజేందర్ ప్రసంగించారు. ఇలా జరుగడం సాంకేతిక లోపమా... కావాలనే చేశారా అనే దానిపై పార్టీ ఆరా తీస్తుంది. బండి సంజయ్‌ వరంగల్ తూర్పు తప్ప మినహా.. మిగతా 118 నియోజకవర్గాల్లో ప్రసంగించారు.

అంతకుముందు బండి సంజయ్​ సరల్​ యాప్​ను ప్రారంభించారు. ఈ యాప్‌లో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీ కార్యక్రమాలు, కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులను పొందుపరుస్తున్నామని తెలిపారు. మరో 6 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. పోలింగ్ బూత్‌ కమిటీల ద్వారానే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ సైతం.. పోలింగ్ బూత్ అధ్యక్షుడిగా పనిచేశారని గుర్తు చేశారు. బీజేపీకి పోలింగ్ బూత్‌ స్థాయి కమిటీలే మూల స్తంభమని బండి సంజయ్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details