హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటిస్తున్నారు. సరూర్‌నగర్‌లో నీటమునిగిన కాలనీలకు వెళ్లిన ఆయన... బాధితుల్ని పరామర్శించారు. వరద వల్ల కలిగిన ఇబ్బందులు, నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో బండి సంజయ్ పర్యటన - Hyderabad Latest News
హైదరాబాద్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించారు. సరూర్నగర్ పరిధిలోని కోదండరాంనగర్‌లో వరద బాధితులను పరామర్శించారు. సంజయ్‌కు వరద బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో బండి సంజయ్ పర్యటన
అనంతరం కోదండరాంనగర్‌కు వెళ్లారు. నాలుగురోజుల నుంచి నీళ్లలోనే నానుతున్నామని... బాధితులకు బండిసంజయ్‌కు గోడు వెళ్లబోసుకున్నారు. భాజపా కార్యకర్తలు ఎక్కడికక్కడ సహాయకచర్యల్లో పాల్గొనాలని.. బండి సంజయ్ కోరారు. వరద బాధితులకు ఆహారం, అవసరమైన వస్తువులు అందించేలా చూడాలని సూచించారు.
- ఇదీ చూడండి:భాగ్యనగరంలో పేదల బతుకుల్ని చిదిమేసిన వర్షం