Bandi Sanjay teleconference on Khammam BJP meeting : కేసీఆర్ గుండెల్లో డప్పులు మోగేలా ఖమ్మం బహిరంగ సభను సక్సెస్ చేయాలని పార్టీ కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ పోలింగ్ బూత్ సభ్యులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్.. తెలంగాణ ప్రజల దృష్టంతా ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్వహించే సభపైనే ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సభ విజయవంతం అయితే రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందన్నారు.
- Bandi Sanjay on BJP Khammam : 'ఖమ్మంలో కమలం తప్పకుండా వికసిస్తుంది'
- Bandi Sanjay On Telangana Formation Day : 'తొమ్మిదేళ్ల BRS పాలనలో ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదు'
కాంగ్రెస్ నేతలు కూడా ఈ సభ ఫెయిల్ కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తల బలం చూపే సమయమొచ్చిందని ఆయన పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఖమ్మంలో బీజేపీ లేదనే వాళ్లకు ఈ సభతో కనువిప్పు కలిగించాలని తెలిపారు. ఈ నెల 15వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు హాజరు అవుతారని పేర్కొన్న బండి సంజయ్.. అభినవ పటేల్ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు, పోలీంగ్ బూత్ సభ్యులకు బహిరంగ సభ ఏర్పాట్లు గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా జన సమీకరణ చేసేందుకు పలు సూచనలు చేశారు.