తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతిస్తే... చూస్తూ ఊరుకోం'

రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ నల్లజెండాలు ఎగురవేశామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ పేర్కొన్నారు. కృష్ణానదీ జలాలను కాపాడటంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ వైఫల్యం చెందారని ఆరోపించారు.

BANDI SANJAY TALK ABOUT POTHIREDDY PADU ISSUE IN HYD
'తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతిస్తే... చూస్తూ ఊరుకోం'

By

Published : May 16, 2020, 1:11 PM IST

Updated : May 16, 2020, 1:51 PM IST

కృష్ణానదీ జలాలను కాపాడటంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ వైఫల్యం చెందారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆరోపించారు. కేసీఆర్​ అసమర్థతను నిరసిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నల్లజెండాలు ఎగురవేశామని తెలిపారు. కృష్ణానదిలో వాస్తవానికి తెలంగాణ వాటా 535 టీఎంసీలు ఉండాలి కానీ కేసీఆర్​ నిర్లక్ష్యం కారణంగా 299 టీఎంసీలకు పరిమితమైందని దుయ్యబట్టారు.

పోతిరెడ్డిపాడు ద్వారా తెలంగాణకు జరిగే అన్యాయాన్ని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్​ శఖావత్​కు రాష్ట్ర భాజపా శాఖ తరఫున రాసిన లేఖకు ఆయన స్పందించి కేఆర్​ఎంబీ సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాలకు భాజపా వ్యతిరేకం కాదని తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతిస్తే.. చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

ఇవీ చూడండి:తెల్లారిన బతుకులు..రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి

Last Updated : May 16, 2020, 1:51 PM IST

ABOUT THE AUTHOR

...view details