Bandi Sanjay sixth phase of Praja Sangrama Yatra: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరవ విడత ప్రజా సంగ్రామ యాత్రకు బీజేపీ అధిష్ఠానం పచ్చజెండా ఊపింది. ఈ నెల 18 నుంచి ప్రారంభించేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర నాయకత్వం రూట్ మ్యాప్‌ను రూపొందించేందుకు కసరత్తు ప్రారంభించింది.
బండి 6వ విడత పాదయాత్రకు హైకమాండ్ గ్రీన్‌సిగ్నల్ - ప్రజా సంగ్రామ యాత్రకు బీజేపీ పచ్చజెండా
Bandi Sanjay sixth phase of Praja Sangrama Yatra: గత ప్రజా సంగ్రామ యాత్రలు విజయవంతమైన అయిన నేపథ్యంలో.. ఆరవ విడత ప్రజా సంగ్రామ యాత్రకు బీజేపీ అధిస్ఠానం ఓకే చెప్పింది. ఈనెల 18 నుంచి సంజయ్ పాదయాత్ర ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
![బండి 6వ విడత పాదయాత్రకు హైకమాండ్ గ్రీన్‌సిగ్నల్ state bjp chief bandi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17375340-thumbnail-3x2-kee.jpg)
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్
కొడంగల్ నుంచి నిజామాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించేందుకు అధిష్ఠానం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆరవ విడత పాదయాత్రను 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఇవీ చదవండి: