టీఎస్పీఎస్సీ గురుకులాల ప్రిన్సిపల్ అభ్యర్థులు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని కలిశారు. నోటిఫికేషన్లో ఉన్న చిన్న చిన్న లోపాలతో దాదాపు 35 మంది మహిళా అభ్యర్థులు నష్టపోతున్నామని వారు సంజయ్‌కి వివరించారు.
'న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం' - గురుకులాల ప్రిన్సిపల్ నోటిఫికేషన్
రాష్ట్రంలో విడుదల చేసిన గురుకులాల ప్రిన్సిపల్ నోటిఫికేషన్లో చిన్న చిన్న తప్పుల వల్ల సుమారు 35 మంది మహిళా అభ్యర్థులు నష్టపోయామని బాధితులు బండి సంజయ్‌కి వివరించారు. అభ్యర్థులు భాజపా రాష్ట్ర అధ్యక్షుడిని కలిసి తమ సమస్యను విన్నవించారు.

'న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం'
ఈ మేరకు వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని సంజయ్ హామీ ఇచ్చారు. ఎన్ని సార్లు టీఎస్పీఎస్సీకి విన్నవించినా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోయారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు వేడుకున్నారు.
ఇదీ చూడండి :14వ సారి యాదాద్రిని సందర్శించనున్న కేసీఆర్