తెలంగాణ

telangana

ETV Bharat / state

Bandi sanjay: 'కేసీఆర్​ రైతు పక్షపాతి కాదు.. రైస్​మిల్లర్లకు సోపతి' - తెలంగాణ వార్తలు

Bandi Sanjay on kcr: కేంద్రమంత్రి విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ భాష ఏమాత్రం బాగాలేదన్నారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కేంద్రమంత్రిపై అలాంటి భాష వాడవచ్చా.. అని ప్రశ్నించారు. సీఎం భాష జుగుప్సాకరంగా ఉందని పేర్కొన్నారు. భాజపా నేతల సహనాన్ని పరీక్షించవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ధాన్యం కొనకపోతే తాము ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. రైతులకు అండగా ఉండాల్సిన సీఎం... రైసు మిల్లర్లకు అండగా ఉంటున్నారని ఆరోపించారు.

Bandi sanjay, Bandi Sanjay press meet about paddy procurement
సీఎం కేసీఆర్​పై బండి సంజయ్ కామెంట్స్

By

Published : Nov 30, 2021, 1:55 PM IST

Updated : Nov 30, 2021, 3:11 PM IST

Bandi Sanjay PC: రైతులకు అండగా ఉండాల్సిన సీఎం... రైసు మిల్లర్లకు అండగా ఉంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. కేంద్రం రా రైసు కొంటుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టంగా చెప్పారన్న సంజయ్... సీఎం మళ్లీ కొంటారా? అని ప్రశ్నించడం దేనికని అన్నారు. సీఎం కేసీఆర్ భాష జుగుప్సాకరంగా ఉందన్నారు. సీఎం వాడే భాష తెలంగాణలో ఎవరైనా మాట్లాడతారా? అని ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్​పై బండి సంజయ్ కామెంట్స్

CM KCR: కేంద్రమంత్రి విషయంలో అలాంటి భాష వాడవచ్చా? అని అన్నారు. సీఎం కేసీఆర్​కు భయపడి మంత్రులు సమర్థిస్తున్నారేమో కానీ... ప్రజలు అలాంటి భాషను సహించరని విమర్శించారు. భాజపా నేతల సహనాన్ని పరీక్షించవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'మేం ఊరుకోం..'

Cabinet meet:'ఇటీవల కేబినెట్ సమావేశం పెట్టారు... ఎవరిని ఎలా తిట్టాలనే విషయంపైనే మంత్రివర్గంలో చర్చించారా?' అని ఎద్దేవా చేశారు. రా రైసు కొంటామని కేంద్రం చెప్తోందన్న సంజయ్... ధాన్యం కొనేది లేదని సీఎం చెప్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనకపోతే తాము ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. యాసంగిలో కూడా పక్కా కొనాల్సిందేనని డిమండ్ చేశారు. లేదంటే ఎందుకు కొనరో సమాధానం చెప్పాలని సవాలు విసిరారు.

'తెలంగాణలోనే సమస్య ఎందుకు?'

వానాకాలం ధాన్యం కొంటానంటున్న కేసీఆర్‌... యాసంగిలో ఎందుకు కొనరని నిలదీశారు. ధాన్యం మొత్తం తానే కొంటున్నట్లు ఇన్నాళ్లు కేసీఆర్‌ గొప్పగా చెప్పలేదా? అని సంజయ్ అన్నారు. ఇతర రాష్ట్రాల్లో లేని సమస్య తెలంగాణలో ఎందుకు వచ్చింది? అని ప్రశ్నించారు. మంచి విత్తనాలు రైతులకు అందిస్తే సమస్య ఉండదని అన్నారు. సీఎం కేసీఆర్‌కు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌పై ప్రేమ పెరిగిపోయిందన్నారు.

రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని అంగీకరించి ఏర్పాటు చేశారా?. ధాన్యం సేకరణలో తెరాస నేతలు అక్రమాలకు పాల్పడ్డారు. పాతబియ్యాన్ని రీ సైక్లింగ్‌ చేసి ఎఫ్‌సీఐకి ఇస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. రైసు మిల్లర్ల మోసాలు బయటపడుతున్నందుకే ధర్నాలు చేస్తున్నారు. రైతులకు అండగా ఉండాల్సిన సీఎం... రైసు మిల్లర్లకు అండగా ఉంటున్నారు. సన్న వడ్లలోనూ 5 రకాల విత్తనాలు ఉన్నాయి, వాటిని వేస్తే మంచి దిగుబడి వస్తుంది. రైతుల ఆత్మహత్యలకు కేసీఆర్‌ కారణం కాదా?. ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం కేసీఆర్‌ కాదా?. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు కేసీఆర్‌ కారణం కాదా?.

-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇదీ చదవండి:Dharmapuri arvind: 'రాష్ట్రం ఏర్పడిన నుంచి ఏ ప్రత్యామ్నాయ పంటను ప్రోత్సహించలేదు'

Last Updated : Nov 30, 2021, 3:11 PM IST

ABOUT THE AUTHOR

...view details