తెలంగాణ

telangana

ETV Bharat / state

Bandi Sanjay: 'కేంద్రం ఉచితంగా ఇస్తున్నా ఏర్పాట్లు చేసుకోలేరా..?' - తెలంగాణ వార్తలు

టీకాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తున్నా... సరైన ఏర్పాట్లు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూకట్‌పల్లిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు.

bandi sanjay, vaccination
వ్యాక్సినేషన్, బండి సంజయ్

By

Published : Jun 21, 2021, 2:03 PM IST

కేంద్రం ఉచితంగా అందిస్తున్న వ్యాక్సిన్​ను ప్రజలకు అందజేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్​లోని కూకట్‌పల్లి నియోజకవర్గం ఎన్.కె.ఎన్.ఆర్ గార్డెన్​లో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా నాయకులతో కలిసి ఈరోజు పరిశీలించారు.‌ టీకా కార్యక్రమం వివరాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా ఇవ్వాలని కేంద్రం చెప్పినా సీఎం కేసీఆర్ స్పందించలేదని విమర్శించారు.

వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రోటోకాల్‌‌ ప్రకారం పీఎం మోదీ ఫోటో వేయకుండా, రాష్ట్ర నాయకుల ఫోటోలు పెట్టడం శోచనీయమన్నారు. కేంద్రం వ్యాక్సిన్​ను ఉచితంగా అందిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ టీకా తీసుకోవాలని ఆయన సూచించారు.

ఇదీ చదవండి:kcr: ఆచార్య జయశంకర్ యాదిలో సీఎం కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details