తెలంగాణ

telangana

ETV Bharat / state

Bandi sanjay comments:  ఈటల గెలుపు.. తెలంగాణలో అధికార మార్పునకు నాంది

ప్రజలందరి ఆశీర్వాదంతో హుజూరాబాద్‌(Huzurabad by elections 2021) గడ్డపై కాషాయ జెండా ఎగురబోతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi sanjay comments) ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో ఈ ఫలితాలతో అర్థమవుతుందన్నారు. కేసీఆర్ ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు విశ్వసించలేదని అభిప్రాయపడ్డారు. 2023ఎన్నికల్లో భాజపా అధికారంలోకి రాబోతుందని అంటున్న బండి సంజయ్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

Bandi sanjay comments, Bandi sanjay news
బండి సంజయ్ కామెంట్స్, ఈటల గెలుపుపై బండి సంజయ్

By

Published : Nov 2, 2021, 3:42 PM IST

Updated : Nov 2, 2021, 4:43 PM IST

హుజూరాబాద్‌ గడ్డపై(Huzurabad by elections 2021) కాషాయ జెండా ఎగరుబోతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌(Bandi sanjay comments) ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై(bandi sanjay comments on cm kcr) ప్రజల్లో విశ్వాసం లేదని అన్నారు. ఈటల రాజేందర్‌ భారీ విజయం సాధించడం ఖాయమని స్పష్టం చేశారు. హుజూరాబాద్ ఫలితాల్లో భాజపా అధిక్యం కనబరుస్తుండడంతో పార్టీ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈటల రాజేందర్‌ భాజపా నాయకుడు... ఈటల గెలుపు భాజపా గెలుపు... భాజపా గెలుపు ఈటల గెలుపేనని బండి సంజయ్‌ అన్నారు. దళితబంధు అమలు చేసినా ప్రజలు సీఎంను నమ్మడంలేదని ఎద్దేవా చేశారు. ఈటల గెలుపుతో తెలంగాణలో అధికార మార్పిడిని ప్రజలు కోరుకుంటున్నారనేది స్పష్టమైందని తెలిపారు.

బండి సంజయ్​తో ముఖాముఖి

కరీంనగర్‌లోని ఎస్​ఆర్​ఆర్ డిగ్రీ కళాశాలలో పటిష్ఠ బందోబస్తు మధ్య కౌంటింగ్‌ జరుగుతోంది. తొలుత 753 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కించారు. అనంతరం ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. 14 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 22 రౌండ్లలో హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఓట్లు లెక్కించనున్నారు. తొలుత హుజూరాబాద్‌ మండలంలోని గ్రామాల ఓట్ల లెక్కించారు. అనంతరం వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ ఓట్లు లెక్కిస్తారు. సాయంత్రం వరకు హుజూరాబాద్ తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది.

ఎనిమిదో రౌండ్ మినహా మిగిలిన రౌండ్లలో ఈటలకే ఆధిక్యం తొలి ఏడు రౌండ్లలోనూ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఆధిక్యంలో నిలిచారు. రౌండ్​ రౌండ్​కు కమలం పార్టీ ఆధిక్యం పెరుగుతోంది. 9వ రౌండ్​లో ఈటల రాజేందర్​ 1,835 ఓట్ల ఆధిక్యం సాధించారు. 9వ రౌండ్​లో 5,105 ఓట్లతో ముందంజలో నిలిచారు. 9వ రౌండ్​లో భాజపా - 5,305, తెరాస - 3,470, కాంగ్రెస్​ - 174 ఓట్లు సాధించాయి. తొమ్మిది రౌండ్లు ముగిసేసరికి భాజపా - 40,412, తెరాసకు - 35,307 ఓట్లు వచ్చాయి. 8వ రౌండ్​ మినహా మిగిలిన అన్ని రౌండ్లలో ఈటలే ఆధిక్యంలో ఉన్నారు.

ఇదీ చదవండి:Etela Rajender leads : మొదటి నుంచి ఈటలదే జోరు.. ఏఏ రౌండ్​లో ఎన్నెన్ని ఓట్లు వచ్చాయంటే?

Last Updated : Nov 2, 2021, 4:43 PM IST

ABOUT THE AUTHOR

...view details