దేశానికి ప్రధాని నరేంద్ర మోదీ సేవలు ఎంతో అవసరమని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. అసాధ్యాలను సైతం సుసాధ్యం చేసి చూపించిన నేత అని ఆయన కొనియాడారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం పురస్కరించుకొని భాజపా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో 70కి పైగా నోములు నిర్వహించారు. నరేంద్ర మోదీ ఆయురారోగ్యాలతో జీవించాలని చేసిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పలువురు నేతలు పాల్గొన్నారు. మోదీ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.